నా కళ్లు
చెట్లు కూలుతున్న దృశ్యం...
పక్షులు నేలకొరుగుతున్న దృశ్యం...
పచ్చని చెట్లమధ్య ఆడుకున్న ఆటలు-
మెల్లగా కరుగుతున్న దృశ్యం...
నాగరికత నాగళ్ళు-
హరిత వనాల్ని బీళ్ళుగా మారుస్తున్న దృశ్యం...
స్వర్గాన్ని తలపించే మా ఊరు-
వల్లకాడులా మారుతున్న దృశ్యం....
నా కళ్లముందు ఎప్పుడూ కదలాడుతూ ఉంటే...
కునుకు పట్టని కళ్లు!
కన్నీటితో చెమర్చిన కళ్లు!!
కాంతి హీనమైన కళ్లు....నా కళ్లు!!!
No comments:
Post a Comment