నీతులూ, విలువల గురించి
నాకు చెప్పకు
నీలో మానవత్వం ఉందో లేదో చెప్పు
మనిషన్న వాడు..మానవత్వం ఉన్నవాడు
ఎక్కడున్నాడో చూపించు
మిగతావాళ్లతో నాకనవసరం
ఆకలితో కడుపు మండే వాడికి
గీతను బోధిస్తే వింటాడా?
అవమానంతో ఊగిపోయే వాడికి
నీతిసూత్రాలు వళ్లిస్తే ఊరుకుంటాడా?
నీ చాదస్తంగానీ...
భంగపడ్డవాడి విశ్వరూపం ముందు
ఆ భగవంతుని విశ్వరూపం చిన్నబోదూ...
నిన్నూ నన్నూ విడదీయడానికి
వేదాలు,స్మృతులూ అవసరమేమో...
మనిషిని మనిషిగా గుర్తించడానికి
మనసుంటే చాలదా..!
కోట్లతో పనిలేదు..కోరిక ఉంటే చాలు
మానవత్వంతో ఎదుటి మనిషిని పలకరించడానికి!
మనిషిని మనిషిగా గుర్తించడానికి
ReplyDeleteమనసుంటే చాలదా..!
కోట్లతో పనిలేదు..కోరిక ఉంటే చాలు
మానవత్వంతో ఎదుటి మనిషిని పలకరించడానికి! బాగున్నాయండీ!
ధన్యవాదాలు...రసజ్ఞ..గారు.
ReplyDelete