21 May 2011
స్పందన
బండబారిన గుండెలు మనకొద్దు
స్పందించే హృదయాలు కావాలి -
ప్రియురాలి స్పర్శకు
అణగారిన ఆశలు రేగాలి,
సఖి చూసిన క్రీగంటి చూపుకు
నరనరాల్లో నక్షత్రాలు వెలగాలి -
అంతే వేగంతో.......
అభాగ్యులు చేసే ఆర్తనాదాలకు
పాషాణమైన గుండె సైతం కరగాలి
కళ్లెదుట జరుగుతున్న అకృత్యాలను చూసి
ఆవేశం కట్టలు తెంచుకోవాలి
ఆపదలో ఉన్నవాళ్లను ఆదుకునేందుకు
చేతులు ముందుకు రావాలి
అన్యాయాన్ని ఎదిరించేందుకు
అడుగులు వడిగా కదలాలి...
ప్రేమైనా..పోరాటమైనా,
కరుణైనా..కదనరంగమైనా,
సరసమైనా.. సమరమైనా...
బండరాళ్ళు కాదు -
కరిగే గుండెలు కావాలి..
కదిలే హృదయాలు కావాలి!
చేతులు ముందుకు రావాలి
అన్యాయాన్ని ఎదిరించేందుకు
అడుగులు వడిగా కదలాలి...
ప్రేమైనా..పోరాటమైనా,
కరుణైనా..కదనరంగమైనా,
సరసమైనా.. సమరమైనా...
బండరాళ్ళు కాదు -
కరిగే గుండెలు కావాలి..
కదిలే హృదయాలు కావాలి!
19 May 2011
అన్వేషణ
నాకు ఇష్టమైంది -
ఏదైనా సరే..
ఎంత చిన్నదైనా సరే..
నాకు దొరికే వరకూ నేను
వెతుకుతూనే ఉంటాను
ఎంత దూరమైనా కావచ్చు
ఎన్ని రోజులైనా పట్టొచ్చు -
కొంతమంది నన్ను
పిచ్చివాడనుకోవచ్చు,
ఇంకొంతమంది
నాకు సమయం విలువ
తెలీదనుకోవచ్చు,
మరికొంతమంది
నేను జీవితాన్నే
వ్యర్థం చేస్తున్నాననుకోవచ్చు -
కానీ నాకు తెలుసు
నాక్కావలసింది వెతుక్కోవడం
నాకు ఎంత అవసరమో..
ఎంత ఇష్టమో...
ఎవరు ఏమనుకున్నా
నా అన్వేషణ ఆగదు -
నాక్కావలసింది నాకు దొరికే వరకూ...
నేను వెతుకుతూనే ఉంటాను!
17 May 2011
తొలకరి చినుకు
ఎర్రని ఎండ
కొలిమిలా మండుతుంది
చుర చుర లాడే వేడి,
భగ్గుమనే సెగ,
తనువంతా ఎండిపోతూ..
నాలుక ఆరిపోతూ..
వంట్లోని శక్తంతా
హరించుకు పోతూ..
కళ్లు బైర్లు కమ్ముతూ..
అడుగుతీసి అడుగు
వేయలేకపోతూ..
నేలకు ఒరిగిపోతున్న
సమయంలో -
టప్పున మీద పడిందొక
నీటి బొట్టు ఆకాశంలోంచి -
హిమనీ నదాల చల్లదనం
నరనరాల్లో ప్రాకుతూ..
అణువణువూ ప్రవహిస్తూ..
హాయిని కురిపిస్తూ..
వెళ్లిపోతున్న శక్తిని
వెనక్కు మళ్లిస్తూ..
పెదవులపై చిరునవ్వును వెలిగిస్తూ..
మదిలో ఆనందం చిందిస్తూ..!
16 May 2011
అస్థిరత్వంలో స్థిరత్వం
సరళ రేఖలు
ఎప్పటికీ సూటిగానే
పయనించలేవు
వేగంగా ప్రవహించే నదులు
ఎన్నెన్నో మలుపులు తిరక్కుండా
ముందుకు సాగలేవు
ఆలోచనా సరళి
ఎప్పుడూ ఒకేలా ఉండదు
ప్రసరించే కాంతి
ఎన్నో వంకర్లు పోక తప్పదు
మనం పీల్చిన గాలి
ఎన్ని ప్రాంతాలకు వ్యాపిస్తుందో!
ఏ కొమ్మలు ఎటు పెరిగినా
ఏ వేళ్ళు ఎంత ప్రాకినా
స్థిరత్వం కోసమేగా ఈ ప్రాకులాటంతా..!
ఈ అంతులేని సృష్టిలో
అస్థిర ప్రేరకాలు అనంతమైతే
అస్థిరత్వమే స్థిరత్వం -
ప్రక్క తోవలు పట్టడమే సరళం -
నదులెన్ని మలుపులు తిరిగినా
చివరకు కలిసేది సముద్రంలోనే!
ఆలోచనలెన్ని పుంతలు తొక్కినా
కడకు అంతమయేది అక్షరంలోనే!!
ఎప్పటికీ సూటిగానే
పయనించలేవు
వేగంగా ప్రవహించే నదులు
ఎన్నెన్నో మలుపులు తిరక్కుండా
ముందుకు సాగలేవు
ఆలోచనా సరళి
ఎప్పుడూ ఒకేలా ఉండదు
ప్రసరించే కాంతి
ఎన్నో వంకర్లు పోక తప్పదు
మనం పీల్చిన గాలి
ఎన్ని ప్రాంతాలకు వ్యాపిస్తుందో!
ఏ కొమ్మలు ఎటు పెరిగినా
ఏ వేళ్ళు ఎంత ప్రాకినా
స్థిరత్వం కోసమేగా ఈ ప్రాకులాటంతా..!
ఈ అంతులేని సృష్టిలో
అస్థిర ప్రేరకాలు అనంతమైతే
అస్థిరత్వమే స్థిరత్వం -
ప్రక్క తోవలు పట్టడమే సరళం -
నదులెన్ని మలుపులు తిరిగినా
చివరకు కలిసేది సముద్రంలోనే!
ఆలోచనలెన్ని పుంతలు తొక్కినా
కడకు అంతమయేది అక్షరంలోనే!!
15 May 2011
14 May 2011
Subscribe to:
Posts (Atom)






