21 May 2011
స్పందన
బండబారిన గుండెలు మనకొద్దు
స్పందించే హృదయాలు కావాలి -
ప్రియురాలి స్పర్శకు
అణగారిన ఆశలు రేగాలి,
సఖి చూసిన క్రీగంటి చూపుకు
నరనరాల్లో నక్షత్రాలు వెలగాలి -
అంతే వేగంతో.......
అభాగ్యులు చేసే ఆర్తనాదాలకు
పాషాణమైన గుండె సైతం కరగాలి
కళ్లెదుట జరుగుతున్న అకృత్యాలను చూసి
ఆవేశం కట్టలు తెంచుకోవాలి
ఆపదలో ఉన్నవాళ్లను ఆదుకునేందుకు
చేతులు ముందుకు రావాలి
అన్యాయాన్ని ఎదిరించేందుకు
అడుగులు వడిగా కదలాలి...
ప్రేమైనా..పోరాటమైనా,
కరుణైనా..కదనరంగమైనా,
సరసమైనా.. సమరమైనా...
బండరాళ్ళు కాదు -
కరిగే గుండెలు కావాలి..
కదిలే హృదయాలు కావాలి!
చేతులు ముందుకు రావాలి
అన్యాయాన్ని ఎదిరించేందుకు
అడుగులు వడిగా కదలాలి...
ప్రేమైనా..పోరాటమైనా,
కరుణైనా..కదనరంగమైనా,
సరసమైనా.. సమరమైనా...
బండరాళ్ళు కాదు -
కరిగే గుండెలు కావాలి..
కదిలే హృదయాలు కావాలి!
19 May 2011
అన్వేషణ
నాకు ఇష్టమైంది -
ఏదైనా సరే..
ఎంత చిన్నదైనా సరే..
నాకు దొరికే వరకూ నేను
వెతుకుతూనే ఉంటాను
ఎంత దూరమైనా కావచ్చు
ఎన్ని రోజులైనా పట్టొచ్చు -
కొంతమంది నన్ను
పిచ్చివాడనుకోవచ్చు,
ఇంకొంతమంది
నాకు సమయం విలువ
తెలీదనుకోవచ్చు,
మరికొంతమంది
నేను జీవితాన్నే
వ్యర్థం చేస్తున్నాననుకోవచ్చు -
కానీ నాకు తెలుసు
నాక్కావలసింది వెతుక్కోవడం
నాకు ఎంత అవసరమో..
ఎంత ఇష్టమో...
ఎవరు ఏమనుకున్నా
నా అన్వేషణ ఆగదు -
నాక్కావలసింది నాకు దొరికే వరకూ...
నేను వెతుకుతూనే ఉంటాను!
17 May 2011
తొలకరి చినుకు
ఎర్రని ఎండ
కొలిమిలా మండుతుంది
చుర చుర లాడే వేడి,
భగ్గుమనే సెగ,
తనువంతా ఎండిపోతూ..
నాలుక ఆరిపోతూ..
వంట్లోని శక్తంతా
హరించుకు పోతూ..
కళ్లు బైర్లు కమ్ముతూ..
అడుగుతీసి అడుగు
వేయలేకపోతూ..
నేలకు ఒరిగిపోతున్న
సమయంలో -
టప్పున మీద పడిందొక
నీటి బొట్టు ఆకాశంలోంచి -
హిమనీ నదాల చల్లదనం
నరనరాల్లో ప్రాకుతూ..
అణువణువూ ప్రవహిస్తూ..
హాయిని కురిపిస్తూ..
వెళ్లిపోతున్న శక్తిని
వెనక్కు మళ్లిస్తూ..
పెదవులపై చిరునవ్వును వెలిగిస్తూ..
మదిలో ఆనందం చిందిస్తూ..!
16 May 2011
అస్థిరత్వంలో స్థిరత్వం
సరళ రేఖలు
ఎప్పటికీ సూటిగానే
పయనించలేవు
వేగంగా ప్రవహించే నదులు
ఎన్నెన్నో మలుపులు తిరక్కుండా
ముందుకు సాగలేవు
ఆలోచనా సరళి
ఎప్పుడూ ఒకేలా ఉండదు
ప్రసరించే కాంతి
ఎన్నో వంకర్లు పోక తప్పదు
మనం పీల్చిన గాలి
ఎన్ని ప్రాంతాలకు వ్యాపిస్తుందో!
ఏ కొమ్మలు ఎటు పెరిగినా
ఏ వేళ్ళు ఎంత ప్రాకినా
స్థిరత్వం కోసమేగా ఈ ప్రాకులాటంతా..!
ఈ అంతులేని సృష్టిలో
అస్థిర ప్రేరకాలు అనంతమైతే
అస్థిరత్వమే స్థిరత్వం -
ప్రక్క తోవలు పట్టడమే సరళం -
నదులెన్ని మలుపులు తిరిగినా
చివరకు కలిసేది సముద్రంలోనే!
ఆలోచనలెన్ని పుంతలు తొక్కినా
కడకు అంతమయేది అక్షరంలోనే!!
ఎప్పటికీ సూటిగానే
పయనించలేవు
వేగంగా ప్రవహించే నదులు
ఎన్నెన్నో మలుపులు తిరక్కుండా
ముందుకు సాగలేవు
ఆలోచనా సరళి
ఎప్పుడూ ఒకేలా ఉండదు
ప్రసరించే కాంతి
ఎన్నో వంకర్లు పోక తప్పదు
మనం పీల్చిన గాలి
ఎన్ని ప్రాంతాలకు వ్యాపిస్తుందో!
ఏ కొమ్మలు ఎటు పెరిగినా
ఏ వేళ్ళు ఎంత ప్రాకినా
స్థిరత్వం కోసమేగా ఈ ప్రాకులాటంతా..!
ఈ అంతులేని సృష్టిలో
అస్థిర ప్రేరకాలు అనంతమైతే
అస్థిరత్వమే స్థిరత్వం -
ప్రక్క తోవలు పట్టడమే సరళం -
నదులెన్ని మలుపులు తిరిగినా
చివరకు కలిసేది సముద్రంలోనే!
ఆలోచనలెన్ని పుంతలు తొక్కినా
కడకు అంతమయేది అక్షరంలోనే!!
15 May 2011
14 May 2011
మంచి మనసు
మేఘాన్ని పొడిచి చూడు
వర్షాన్ని కురిపిస్తుంది
భూగర్భాన్ని త్రవ్వి చూడు
జలధారలు అందిస్తుంది
క్రొవ్వొత్తిని కాల్చి చూడు
కాంతులు వెదజల్లుతుంది
వృక్షాన్ని నరికి చూడు
కొత్తచిగుళ్లు మొలిపిస్తుంది
చందమామను తరచి చూడు
వెన్నెలలు ప్రసరిస్తుంది
పుత్తడిని మరిగించి చూడు
మెరుపులు పూయిస్తుంది
ఓ మంచి మనసును పరికించి చూడు
మానవత్వం వెల్లివిరుస్తుంది!
వర్షాన్ని కురిపిస్తుంది
భూగర్భాన్ని త్రవ్వి చూడు
జలధారలు అందిస్తుంది
క్రొవ్వొత్తిని కాల్చి చూడు
కాంతులు వెదజల్లుతుంది
వృక్షాన్ని నరికి చూడు
కొత్తచిగుళ్లు మొలిపిస్తుంది
చందమామను తరచి చూడు
వెన్నెలలు ప్రసరిస్తుంది
పుత్తడిని మరిగించి చూడు
మెరుపులు పూయిస్తుంది
ఓ మంచి మనసును పరికించి చూడు
మానవత్వం వెల్లివిరుస్తుంది!
13 May 2011
మా దారిన మమ్మల్ని పోనివ్వండి
మీరు జ్ఞానులు
మేము అజ్ఞానులం
మీది వెలుతురుదారి
మాది చీకటి త్రోవ
తెల్లని వెలుతురులో
దర్జాగా నడుచుకుంటూ
వెళ్లేవారు మీరు
చిక్కని చీకటిలో
దిక్కు తెలియక
బిక్కు బిక్కుమంటూ
తిరిగేవాళ్లం మేము
మేము అజ్ఞానులం
మీది వెలుతురుదారి
మాది చీకటి త్రోవ
తెల్లని వెలుతురులో
దర్జాగా నడుచుకుంటూ
వెళ్లేవారు మీరు
చిక్కని చీకటిలో
దిక్కు తెలియక
బిక్కు బిక్కుమంటూ
తిరిగేవాళ్లం మేము
మీరు జ్ఞానమూర్తులు
మేము గానుగెద్దులం
చుక్కల కాంతిలో
చందమామ వెన్నెల్లో
నలుపు ఛాయలు అంటని
వెలుగు ప్రయాణం మీది -
చిమ్మ చీకటిలో
ఎప్పటికయినా
చిన్నవెలుగు చుక్క
కనబడకపోతుందా అని
ఎదురు చూస్తూ నడిచేవాళ్లం మేము -
మీదారిలో మీరు హాయిగా...
చీకటి చొరబడకుండా నడవండి
చీకటి తెరలను ఛేదించుకుంటూ...
వెలుగు రేఖలు వెతుక్కుంటూ...
మా దారిన మమ్మల్ని పోనివ్వండి
మేము గానుగెద్దులం
చుక్కల కాంతిలో
చందమామ వెన్నెల్లో
నలుపు ఛాయలు అంటని
వెలుగు ప్రయాణం మీది -
చిమ్మ చీకటిలో
ఎప్పటికయినా
చిన్నవెలుగు చుక్క
కనబడకపోతుందా అని
ఎదురు చూస్తూ నడిచేవాళ్లం మేము -
మీదారిలో మీరు హాయిగా...
చీకటి చొరబడకుండా నడవండి
చీకటి తెరలను ఛేదించుకుంటూ...
వెలుగు రేఖలు వెతుక్కుంటూ...
మా దారిన మమ్మల్ని పోనివ్వండి
08 May 2011
కుటుంబంలో కొంచెం
అమ్మ!
ఎంత కమ్మని పదం!
ప్రతిఒక్కరికీ జన్మనిచ్చేది అమ్మ
ఈ సృష్టికి మూలం అమ్మ
అమ్మపెట్టిన గోరుముద్దలు తినే
మనందరం పెరిగాం
అమ్మకు భూదేవంత సహనం
సముద్రమంత మనసు
ఆకాశమంత అనురాగం
అమ్మ, అమ్మ, అమ్మ!
ధ్యాసంతా అమ్మమీదే
కానీ ఎప్పటి వరకు?
నీ జీవితంలో
ఇంకో స్త్రీ ప్రవేశించేవరకే -
ఆ తరువాత.....
అంతా నాకుటుంబం
నా భార్య, నా పిల్లలు -
మన కుటుంబాల్లో...
మనల్ని కనీ పెంచిన
అమ్మక్కూడా కొంచెం చోటిద్దాం!
అమ్మ ఋణం కొంతైనా తీర్చుకుందాం!!
04 May 2011
నాకు దేవుడు కనిపించాడు
దేవుడున్నాడా? ఉంటే కనిపించడేం?
దేవుడెలా ఉంటాడు?
ఈ సందేహాలకు సమాధానం దొరక్క
ఎక్కడెక్కడో తిరిగాను
ఎంత దూరమో నడిచాను...
ఊళ్ళూ వాడలూ, కొండలూ కోనలూ
నదులూ సముద్ర తీరాలూ -
ఎంత వెతికినా దేవుడి జాడ దొరకలేదు
నా పట్టూ వీడలేదు
తిరిగి తిరిగి అలసి పోయా
ఓపిక నశించి ఓ చోట కుప్పకూలిపోయా -
ఓ చెయ్యి ప్రేమతో
నీళ్లందించి నా దాహాన్ని తీర్చింది
ఇంకో చెయ్యి ఆప్యాయంగా
అన్నంపెట్టి నా ఆకలి పోగొట్టింది
మరో చెయ్యి కరుణతో
ఔషధమిచ్చి నాకు ఉపశమనాన్ని చేకూర్చింది
వాళ్ళ మంచితనం నా హృదయాన్ని కదిలించింది
ఎక్కడలేని శక్తిని నాకందించింది
తిరిగి మొదలైంది నా శోధన
పోగా పోగా ఒక కొండపై
నాకో అశరీర వాణి వినిపించి
నేనే దేవుణ్ణని చెప్పింది
నువ్వే దేవుడివైతే నాముందు ప్రత్యక్షమై
నాకెందుకు కనిపించవని అడిగా
దానికది నవ్వి
పిచ్చివాడా నువ్వు నన్నెప్పుడో చూశావు
దారిలో నువ్వు శోషతో పడిపోయినప్పుడు
నీ దాహాన్ని తీర్చిన 'ప్రేమ' నే నేను
నీ ఆకలి పోగొట్టిన 'ఆప్యాయత' నే నేను
నీకు ఔషధమిచ్చిన 'కరుణ' నే నేను
ఆ ఊరి వాళ్ళు చూపించిన 'మంచితనమే' నేను
ఇప్పుడు చెప్పు నీకు నేను కనిపించానా లేదా?
అప్పుడు అర్థమైంది నాకు
దేవుడు ఎక్కడున్నాడో...
ఏ రూపంలో ఉంటాడో...
నేనక్కడ్నుండి వెనుదిరిగాను
ఎందుకంటే.....
నాకిప్పుడు తెలుసు..
దేవుణ్ణి ఎక్కడ వెతకాలో!
దేవుడెలా ఉంటాడు?
ఈ సందేహాలకు సమాధానం దొరక్క
ఎక్కడెక్కడో తిరిగాను
ఎంత దూరమో నడిచాను...
ఊళ్ళూ వాడలూ, కొండలూ కోనలూ
నదులూ సముద్ర తీరాలూ -
ఎంత వెతికినా దేవుడి జాడ దొరకలేదు
నా పట్టూ వీడలేదు
తిరిగి తిరిగి అలసి పోయా
ఓపిక నశించి ఓ చోట కుప్పకూలిపోయా -
ఓ చెయ్యి ప్రేమతో
నీళ్లందించి నా దాహాన్ని తీర్చింది
ఇంకో చెయ్యి ఆప్యాయంగా
అన్నంపెట్టి నా ఆకలి పోగొట్టింది
మరో చెయ్యి కరుణతో
ఔషధమిచ్చి నాకు ఉపశమనాన్ని చేకూర్చింది
వాళ్ళ మంచితనం నా హృదయాన్ని కదిలించింది
ఎక్కడలేని శక్తిని నాకందించింది
తిరిగి మొదలైంది నా శోధన
పోగా పోగా ఒక కొండపై
నాకో అశరీర వాణి వినిపించి
నేనే దేవుణ్ణని చెప్పింది
నువ్వే దేవుడివైతే నాముందు ప్రత్యక్షమై
నాకెందుకు కనిపించవని అడిగా
దానికది నవ్వి
పిచ్చివాడా నువ్వు నన్నెప్పుడో చూశావు
దారిలో నువ్వు శోషతో పడిపోయినప్పుడు
నీ దాహాన్ని తీర్చిన 'ప్రేమ' నే నేను
నీ ఆకలి పోగొట్టిన 'ఆప్యాయత' నే నేను
నీకు ఔషధమిచ్చిన 'కరుణ' నే నేను
ఆ ఊరి వాళ్ళు చూపించిన 'మంచితనమే' నేను
ఇప్పుడు చెప్పు నీకు నేను కనిపించానా లేదా?
అప్పుడు అర్థమైంది నాకు
దేవుడు ఎక్కడున్నాడో...
ఏ రూపంలో ఉంటాడో...
నేనక్కడ్నుండి వెనుదిరిగాను
ఎందుకంటే.....
నాకిప్పుడు తెలుసు..
దేవుణ్ణి ఎక్కడ వెతకాలో!
03 May 2011
స్వేచ్ఛ
ఏ అరమరికలూ లేకుండా..
ఏ చీకటి తెరలూ ముసరకుండా..
ఏ కన్నీటి పొరలూ అంటకుండా..
స్వేచ్ఛగా జన్మించిన నాకు
ఎందుకీ తీరని బంధనాలు?
ఈ వీడని దాశ్య శృంఖలాలు??
ఎందుకు నాకీ కుల మత జాతి వైషమ్యాలు
ఈ ఇజాలూ ఇమేజ్ లు
ఈ వేషాలూ భేషజాలు -
ఈ పరువుకోసం పరుగులూ...
ప్రతిష్ఠకోసం ప్రాకులాటలు -
ఏ ఆర్భాటమూ లేని ఆ గాలులు చూడు
ఎంత హాయిగా వీస్తున్నాయో,
ఏ పగ్గమూ లేని ఆ మేఘాలు చూడు
ఆకాశంలో ఎలా విహరిస్తున్నాయో,
ఏ ఆటంకమూ లేని ఆ నదులు చూడు
ఎలా పరవళ్లు తొక్కుతూ పారుతున్నాయో,
ఏ బిడియమూ లేని ఆ పక్షులు చూడు
ఎంత శ్రావ్యముగా పాడుతున్నాయో,
ఏ భయమూ లేని ఆ జలపాతాలు చూడు
ఎంత వెల్లువగా దూకుతున్నాయో,
ఏ చింతా లేని ఆ గిరులు చూడు
ఎంత నిశ్చలంగా కూర్చున్నాయో,
ఏ బింకమూ లేని ఆ తరులు చూడు
ఎంత ఒద్దికగా నిలబడి ఉన్నాయో
వీటన్నిటికీ లేని సంకెళ్ళు నాకెందుకో?
నాకెప్పుడు దొరుకుతుందో మరి
వాటికున్న స్వేచ్ఛ??
ఎప్పుడు తొలగుతాయో మరి
నా చుట్టూ ఉన్న ఇనుపచెరలు???
ఏ చీకటి తెరలూ ముసరకుండా..
ఏ కన్నీటి పొరలూ అంటకుండా..
స్వేచ్ఛగా జన్మించిన నాకు
ఎందుకీ తీరని బంధనాలు?
ఈ వీడని దాశ్య శృంఖలాలు??
ఎందుకు నాకీ కుల మత జాతి వైషమ్యాలు
ఈ ఇజాలూ ఇమేజ్ లు
ఈ వేషాలూ భేషజాలు -
ఈ పరువుకోసం పరుగులూ...
ప్రతిష్ఠకోసం ప్రాకులాటలు -
ఏ ఆర్భాటమూ లేని ఆ గాలులు చూడు
ఎంత హాయిగా వీస్తున్నాయో,
ఏ పగ్గమూ లేని ఆ మేఘాలు చూడు
ఆకాశంలో ఎలా విహరిస్తున్నాయో,
ఏ ఆటంకమూ లేని ఆ నదులు చూడు
ఎలా పరవళ్లు తొక్కుతూ పారుతున్నాయో,
ఏ బిడియమూ లేని ఆ పక్షులు చూడు
ఎంత శ్రావ్యముగా పాడుతున్నాయో,
ఏ భయమూ లేని ఆ జలపాతాలు చూడు
ఎంత వెల్లువగా దూకుతున్నాయో,
ఏ చింతా లేని ఆ గిరులు చూడు
ఎంత నిశ్చలంగా కూర్చున్నాయో,
ఏ బింకమూ లేని ఆ తరులు చూడు
ఎంత ఒద్దికగా నిలబడి ఉన్నాయో
వీటన్నిటికీ లేని సంకెళ్ళు నాకెందుకో?
నాకెప్పుడు దొరుకుతుందో మరి
వాటికున్న స్వేచ్ఛ??
ఎప్పుడు తొలగుతాయో మరి
నా చుట్టూ ఉన్న ఇనుపచెరలు???
02 May 2011
చివరకు చేసేదెవరో?
కొందరు చెప్పేదొకటి
చేసేదొకటి
కొందరు చేసేదొకటి
చూపించేదొకటి
కొందరు చెప్పడమేగాని
చేసేదేమీ ఉండదు
కొందరు చెప్పేదుండదూ
చేసేదీ ఉండదు
కొందరు చెప్పరుగానీ
చేసేస్తుంటారు
కొందరు ఏంచేసేదీ
మనకు తెలియనివ్వరు
కొందరు చెప్పి మరీ
చేస్తుంటారు
కొందరు చెప్పేదీ అర్థం కాదు
చేసేదీ అర్థం కాదు
కొందరు ఏదో చేసేద్దాం
అనుకుంటారు కానీ ఏమీ చెయ్యలేరు
కొందరు చెప్పిందే చేస్తారు
చేసేదే చెప్తారు
ఎవరేం చెప్తున్నారో...
ఎవరేం చేస్తున్నారో...
చివరకు చేసేదెవరో?
మనలో చూసేదెవరో??
చేసేదొకటి
కొందరు చేసేదొకటి
చూపించేదొకటి
కొందరు చెప్పడమేగాని
చేసేదేమీ ఉండదు
కొందరు చెప్పేదుండదూ
చేసేదీ ఉండదు
కొందరు చెప్పరుగానీ
చేసేస్తుంటారు
కొందరు ఏంచేసేదీ
మనకు తెలియనివ్వరు
కొందరు చెప్పి మరీ
చేస్తుంటారు
కొందరు చెప్పేదీ అర్థం కాదు
చేసేదీ అర్థం కాదు
కొందరు ఏదో చేసేద్దాం
అనుకుంటారు కానీ ఏమీ చెయ్యలేరు
కొందరు చెప్పిందే చేస్తారు
చేసేదే చెప్తారు
ఎవరేం చెప్తున్నారో...
ఎవరేం చేస్తున్నారో...
చివరకు చేసేదెవరో?
మనలో చూసేదెవరో??
ప్రకృతి ఋణం
ఈ ప్రకృతి ఎంత నిస్వార్ధమైనది?
తనలో దాచుకున్న అందాలన్నీ
ఏ ప్రతిఫలమూ ఆశించకుండా
మనకు ఎంత ప్రేమతో పంచుతుంది!
లేకుంటే....
ఈ విరులు..మరులుగొలిపే
సుగంధాలను ఎందుకు వెదజల్లుతున్నట్లు,
ఈ తరులు ఏ కోరికతో
కనులకింపైన పసిమిని నేలంతా పరుస్తున్నట్లు,
ఈ కోయిలలు ఎదను మీటే
మధురగీతాలను ఎందుకు పాడుతున్నట్లు,
ఈ మరీచికలు ఎవరి ప్రాపకానికై
హాయిగొలిపే వింజామరలు వీస్తున్నట్లు,
ఈ తొలకరి చినుకులు ఏ ఆశతో
అణగారిన తనువులను చిరుజల్లుతో తడుపుతున్నట్లు,
ఈ నెమళ్లు ఏ వ్యామోహంతో
అద్భుతంగా పురివిప్పి నాట్యమాడుతున్నట్లు,
ఈ సెలయేళ్లు ఏ కాంక్షతో
సరిగమల గలగలలు వినిపిస్తున్నట్లు,
ఆ ఇంద్ర ధనస్సు ఏ వాంఛతో
అంబరాన సప్తవర్ణాలను చిత్రీకరిస్తున్నట్లు...
ఇంతటి అందమైన అనుభూతిని
మనకు అందించే ప్రకృతి ఋణాన్ని
మనమెలా తీర్చుకుంటున్నట్లు???
తనలో దాచుకున్న అందాలన్నీ
ఏ ప్రతిఫలమూ ఆశించకుండా
మనకు ఎంత ప్రేమతో పంచుతుంది!
లేకుంటే....
ఈ విరులు..మరులుగొలిపే
సుగంధాలను ఎందుకు వెదజల్లుతున్నట్లు,
ఈ తరులు ఏ కోరికతో
కనులకింపైన పసిమిని నేలంతా పరుస్తున్నట్లు,
ఈ కోయిలలు ఎదను మీటే
మధురగీతాలను ఎందుకు పాడుతున్నట్లు,
ఈ మరీచికలు ఎవరి ప్రాపకానికై
హాయిగొలిపే వింజామరలు వీస్తున్నట్లు,
ఈ తొలకరి చినుకులు ఏ ఆశతో
అణగారిన తనువులను చిరుజల్లుతో తడుపుతున్నట్లు,
ఈ నెమళ్లు ఏ వ్యామోహంతో
అద్భుతంగా పురివిప్పి నాట్యమాడుతున్నట్లు,
ఈ సెలయేళ్లు ఏ కాంక్షతో
సరిగమల గలగలలు వినిపిస్తున్నట్లు,
ఆ ఇంద్ర ధనస్సు ఏ వాంఛతో
అంబరాన సప్తవర్ణాలను చిత్రీకరిస్తున్నట్లు...
ఇంతటి అందమైన అనుభూతిని
మనకు అందించే ప్రకృతి ఋణాన్ని
మనమెలా తీర్చుకుంటున్నట్లు???
01 May 2011
భక్తి
ఈమధ్య పుణ్యక్షేత్రాలు
దర్శించుకోవడం
కొంచెం ఎక్కువే అయింది...
అది చూసి
దూరబ్బంధువొకతను
మీకీ నడుమ భక్తి బాగా ఎక్కువైనట్టుందే
అని ఎగతాళిగా ఇకిలించాడు -
అజ్ఞాని!
తనకేం తెలుసు?
భక్తంటే...
పూజలు చెయ్యడం,
గుళ్ళూ గోపురాలు తిరగడం కాదని!
దేవుడిమీద నిజమైన భక్తి ఉంటే
ఎక్కడకూ వెళ్లనఖ్ఖరలేదని!
ఆ దేవుడు నీలోనే కొలువై ఉంటాడని!
నేను ఆలయాల చుట్టూ
తిరిగేదీ భక్తి ఎక్కువైకాదని!!
దర్శించుకోవడం
కొంచెం ఎక్కువే అయింది...
అది చూసి
దూరబ్బంధువొకతను
మీకీ నడుమ భక్తి బాగా ఎక్కువైనట్టుందే
అని ఎగతాళిగా ఇకిలించాడు -
అజ్ఞాని!
తనకేం తెలుసు?
భక్తంటే...
పూజలు చెయ్యడం,
గుళ్ళూ గోపురాలు తిరగడం కాదని!
దేవుడిమీద నిజమైన భక్తి ఉంటే
ఎక్కడకూ వెళ్లనఖ్ఖరలేదని!
ఆ దేవుడు నీలోనే కొలువై ఉంటాడని!
నేను ఆలయాల చుట్టూ
తిరిగేదీ భక్తి ఎక్కువైకాదని!!
ఒక చీకటి రాత్రి
ష్...నిశ్శబ్దం..!
నాకేవో శబ్దాలు వినబడుతున్నాయ్!
లోకమంతా గాఢ సుషుప్తిలో
మునిగిన వేళ
ప్రపంచమంతా అంధకారం
అలుముకున్న వేళ
ఒంటరిగా నేను
చీకటి కిటికీలోంచి
ఆకాశంవైపు చూస్తుంటే
చిక్కని చీకటిలో
అంతుచిక్కని ఆకారాలేవో
అటూ ఇటూ తిరుగుతూ
అర్థంకాని మాటలేవో
మాట్లాడుకుంటూ
నాకేదో చెప్పాలని
వ్యర్థ ప్రయత్నం చేస్తుంటే -
ఎక్కడలేని భయంతో...
వెన్నులో వణుకుతో...
వళ్లంతా చెమటతో...
నా శ్వాస నాకే
భయంకరమైన శబ్దంలా,
నన్ను చుట్టుముట్టిన శక్తులేవో
నా చెవిదగ్గర చేరి
కర్ణభేరి పగిలిపోయేలా చేస్తున్న
మృత్యుఘోషలా,
వినిపిస్తుంటే -
కళ్లు ఉబికి...
కాళ్లు వణికి...
గజగజలాడుతు నిలబడి ఉంటే -
భుజం మీద వెనుకనుండి
చెయ్యేదో పడ్డట్టై
గబుక్కున వెనుదిరిగి చూస్తే
చటుక్కున మెలకువొచ్చి
మంచంపై కూర్చున్నా -
అప్పుడు తెలిసింది
అదొట్టి కల అని
నన్ను తీవ్రంగా భయపెట్టిన పీడకలని!
Subscribe to:
Posts (Atom)