17 February 2013

ప్రేమ










అమ్మాయిల్ని పడేయాలని
చేసేది కాదు నిజమైన ప్రేమ!
ఆజన్మాంతం ఒకరినొకరితో
ముడివేసేదే అసలైన ప్రేమ!!

జీవితం









నిన్నొక స్వప్నం
నేడొక సమరం
రేపొక  ఆశలతీరం!

16 February 2013

పరిశోధన





నాలా నేను ఉందామనుకున్నా - 
ఎలాగోలా... 
సాధ్య పడలా...
సాధించే తీరాలనుకున్నా -
అసాధ్యుడిలా..
ఏమీ బోధపడలా...
ఎవడో ఒకడు 
అడ్డుపడుతూనేఉన్నాడు సైంధవుడిలా..
అయినా ప్రయత్నిస్తూనే ఉన్నా
ఒక పరిశోకుడిలా!

నాలో నేను





నేను నేనుగా నాలో నేను
నాలోలేని నేను
నేనుకాని నేను
నేను కావాలనుకునే నేను
నేనే నేను
నేనులేని నేను
నీకు కనిపించే నేను
నేను కాని నేను
నాలో లేను!

అగ్ని పథం








పచ్చని ఆకులు పరచిన 
సుతిమెత్తని మార్గం నాకెందుకు?
భగభగ మండే రుధిరజ్వాలల
అగ్నిపథం నన్నాహ్వానిస్తుంటే!!

13 February 2013

హృదయార్పణ

Add caption
నినుగాంచిన ఆ నిముషమే
శిలగా  మారిపోతా నేను..
నీ చూపుల శర వర్షం
నను తాకిన  మరుక్షణమే 
నిశ్చలినై నిలబడిపోతా నేను..
తనువును విడిచిన ప్రేమాత్మ
పరమాత్మను కోరే మోక్షగామిలా
నినువెతుకుతూ వెళ్తుంది -
నీ స్పర్శా భాగ్యం కలిగిన తరుణాన
తూర్పున వికసించిన అరుణపుష్పంలా
నీలో తాథాత్మ్యమై పోతా...    
సుదూర తీరాన ఏకమైన
రెండు ఆత్మల సంగమంలో
ప్రకృతి పులకించి
పురుషుడు పరవశించిన వేళ - 
రంగురంగుల ఇంద్రచాపం
దివినుంచి భువికి దిగివచ్చిన వేళ -
నీకు అర్పిస్తా నా మనస్సుమాంజలి
నీకు సమర్పిస్తా  నా హృదయ కుసుమాంజలి!

12 February 2013

అన్యాయం


తెలుగులో ' న్యాయం'  సరే...
తెలుగుకు న్యాయం జరిగేదెప్పుడు?
ఏమిటో..?
అక్షరం ముక్క రానివాళ్లు 
ఆంగ్ల పదాలు అవలీలగా వాడేస్తుంటే..
పట్టభద్రులు సైతం సరైన తెలుగు పదాలకోసం
తడుముకోవడం చూస్తుంటే...
తెలుగు భాషకు పట్టిన తెగులు వదిలించడానికి
ఏ మందు వాడాలో తెలియడం లేదు మరి?
నేను తెలుగు వాడినని
నా మాతృభాష తెలుగని
తెలుగు అక్షరం తలకట్టులాగా
తలెత్తుకొని గర్వంగా ప్రతి తెలుగువాడూ
చెప్పుకొనే రోజు ఎప్పుడొస్తుందో ఏమో మరి!