25 March 2011

ఎక్కడ స్త్రీ గౌరవించబడుతుందో...

పొద్దున్నే లేచి
ఇల్లంతా తుడిచి...
తన పళ్లు తోమకుండానే
ఇంట్లోని అంట్లన్నీ తోమాలి-
యజమాని తిన్నాక
మిగిల్తే ఏమైనా తినాలి-
బాల్యం తీరకముందే
ఇంటి బరువు మోయాలి-
మన కళ్ల ముందే
జరుగుతున్న నేరమిది!
భావి భారత   స్త్రీకి
మనమిస్తున్న గౌరవమిది!!

2 comments:

  1. మగవాడికి అంట్లు తోమమంటే తోమడు. ఎందుకు అని అడిగితే తనకి మొదటి నుంచి అలవాటు లేదంటాడు.

    ReplyDelete
  2. అలవాట్లు,ఆలోచనలు మారాలి..స్త్రీకి గౌరవం పెరగాలి... మీ స్పందనకు థాంక్స్‌..ప్రవీణ్‌ శర్మ గారూ..

    ReplyDelete