అక్షరరూపం దాల్చిన మనసులోని మాటలు, మెదడులోని ఆలోచనలు
25 March 2011
పొగడరా...పొగడరా...
మార్గాలెన్నైనా
గమ్యమొక్కటే
మతాలెన్నైనా
దైవమొక్కటే -
యాసలెన్నైనా
భాష ఒక్కటే
భాషలెన్నైనా
భావమొక్కటే -
దేశ భాషలందు
తెలుగు లెస్స
ప్రపంచ దేశాలందు
భరతమాత దిట్ట -
"పొగడరా నీ తల్లి
భూమి భారతిని
నిలపరా నీజాతి
నిండు గౌరవం"
"మనమంతా బానిసలం, గానుగలం, పీనుగులం! వెనుక దగా, ముందు దగా కుడి ఎడమల దగా, దగా!" సంతోష్ కుమార్ గారూ, మనం... మనిషిని మనిషి దోచుకొనే వ్యవస్థలో ఉన్నాం. బలవంతుడు బలహీనున్ని ప్రతిచోటా దోచుకుంటూనే ఉన్నాడు. ఇది దోపిడీ వ్యవస్థ. దీనికి ఎవరూ అతీతులు కారు. బలవంతులైన అన్నలు, ఊడిగం చేసే తమ్ముల్లూ అన్నిచోట్లా ఉన్నారు. ఒక ప్రాంతమంతా ఇంకొక ప్రాంతాన్ని మూకుమ్మడిగా దోచుకుంటుంది అనడం అర్థం లేని అపవాదు. అసమానతలు, అవకతవకలూ అన్ని ఊళ్ళలో ఉన్నాయి. అన్నదమ్ములందర్నీ విడగొట్టుకుంటూ పోతే దానికి అంతెక్కడ. మీ ఆవేశానికి అర్థం ఉంది. కాకపోతే ఇక్కడ బావుకునేదెవరు, దేవుకునేదెవరనేది తెలుసుకోవలసిన విషయం. అందరూ ఒక్కటై వ్యవస్థలో మార్పు కోసం పోరాడవలసిన సమయంలో, మనమధ్యలో చిచ్చు పెట్టి తమాషా చూస్తున్న వాళ్ళ గురించే మనం తెలుసుకోలేకపోతున్నాం. అదే మన దుర దృష్టం. ఎనీ హౌ .. మీ స్పందనకు చాలా ధన్యవాదాలు..
enduku pogadali...
ReplyDeletenaa talli nannu chinna chestondi.. naa tammudini garabam cestondi.. nato vadiki udigam cheyistondi.. nenu verega chaduvukoni paikostanante nuvvu udiganiki tappa enduku panikiravantondi.. tammudito kalisi undalsindenantondi.. na kandalato vaanni poshistondi. na chematato vadiki seda teerustondi. nenu chastunna chache daka vadiki udigam cheyamantondi.. vaadiki 60 ella kritame swatantram vachindi.. neninka banisagane unna..
emani pogadali.. na talli bhoomi bharatini
"మనమంతా బానిసలం,
ReplyDeleteగానుగలం, పీనుగులం!
వెనుక దగా, ముందు దగా
కుడి ఎడమల దగా, దగా!"
సంతోష్ కుమార్ గారూ, మనం... మనిషిని మనిషి దోచుకొనే వ్యవస్థలో ఉన్నాం. బలవంతుడు బలహీనున్ని ప్రతిచోటా దోచుకుంటూనే ఉన్నాడు. ఇది దోపిడీ వ్యవస్థ. దీనికి ఎవరూ అతీతులు కారు. బలవంతులైన అన్నలు, ఊడిగం చేసే తమ్ముల్లూ అన్నిచోట్లా ఉన్నారు. ఒక ప్రాంతమంతా ఇంకొక ప్రాంతాన్ని మూకుమ్మడిగా దోచుకుంటుంది అనడం అర్థం లేని అపవాదు. అసమానతలు, అవకతవకలూ అన్ని ఊళ్ళలో ఉన్నాయి. అన్నదమ్ములందర్నీ విడగొట్టుకుంటూ పోతే దానికి అంతెక్కడ. మీ ఆవేశానికి అర్థం ఉంది. కాకపోతే ఇక్కడ బావుకునేదెవరు, దేవుకునేదెవరనేది తెలుసుకోవలసిన విషయం. అందరూ ఒక్కటై వ్యవస్థలో మార్పు కోసం పోరాడవలసిన సమయంలో, మనమధ్యలో చిచ్చు పెట్టి తమాషా చూస్తున్న వాళ్ళ గురించే మనం తెలుసుకోలేకపోతున్నాం. అదే మన దుర దృష్టం. ఎనీ హౌ .. మీ స్పందనకు చాలా ధన్యవాదాలు..