27 June 2011

రాతి పుష్పం

ఏమీ అర్థం కాని పసితనం
అమ్మా అయ్యా ఎటు తీసుకెళ్తే అటే
ఏం జరుగుతుందో తెలీదు
కొంతకాలం కన్‌స్ట్రక్షన్‌ సైటు దగ్గర
రణగొణ ధ్వనుల మధ్య
కొయ్యకు కట్టిన ఉయ్యాల్లో...
ఇంకొంతకాలం క్వారీ వద్ద
ఏ ట్రక్కు నీడలోనో నిద్రపోతూ...
మరికొంతకాలం రోడ్డు నిర్మాణం పక్కన
ఏ తారు మిక్సర్‌ వెనకాలో......

పొట్ట కూటికోసం
పట్టణానికి వలసొచ్చిన
పేద కార్మికులకు పుట్టడం
ఆ పిల్లవాడు చేసిన నేరమా?
ఏ లారీ చక్రం కింద నలిగో,
ఏ మరుగుతున్న తారుకింద కరిగో
అసువులు బాయక బ్రతికి బయట పడినా..
చదువులేకా...బడి మొహమే ఎరక్కా..
ఎండకూ...వానకూ...గాలికీ..
పెరిగి..పెద్దవాడై..
అయ్యా అమ్మా చేసే పనే
తనూ చేసుకుంటూ
రాతి పుష్పంలా
జీవించడం కన్నా
ఇంకేంచెయ్యగలడు -
అతని  పుట్టుకే
అతనికొక శాపమైనప్పుడు!

3 comments:

  1. ఇక్కడ అడ్వర్టైజ్ చేస్తున్నందుకు క్షమించాలి. తెలుగు వెబ్ మీడియా వారు ప్రారంభించిన వీడియో చానెల్‌కి నిర్మాతలు కావలెను. మా వీడియో చానెల్ URL http://videos.teluguwebmedia.in మీరు కాంటేసియా స్టూడియో లేదా సైబర్‌లింక్ పవర్ డైరెక్టర్ ద్వారా వీడియోలు రూపొందించి మాకు పంపవలెను. వీడియో యొక్క ఫైల్‌ని మెయిల్‌లో అటాచ్ చేసి ఈ అడ్రెస్‌లకి పంపవలెను telugu-videos[at]posterous.com , praveensarma[at]teluguwebmedia.in

    ReplyDelete
  2. thank you very much for your compliment.. vanajavanamali gaaru...!

    ReplyDelete