అక్షరరూపం దాల్చిన మనసులోని మాటలు, మెదడులోని ఆలోచనలు
19 June 2011
కాలంతో నేను...
కాలం విరగబూసింది
నా కోరికలా
కాలం కుండపోతగా కురిసింది నా ఆలోచనా పర్వంలా
కాలం నవ్వింది
నా హృదయంలా
కాలం పరిగెత్తింది
నా వయసులా
కాలం ఫలించింది
నా ఆశలా
కాలం మసకేసింది
నా నిరాశలా ఎప్పటికీ...
నాతోనే కాలం -
కాలంతోనే నేను!
No comments:
Post a Comment