12 September 2011

ఊరు ఏడుస్తుంది!

ఏమైంది నా ఊరికి?
పచ్చగా నవ్వే పొలాలు
వెచ్చని పలకరింపులు
గలగల మాట్లాడే సెలయేళ్లు
చెంగు చెంగున ఆడుకొనే లేగ దూడలు
ఎద్దుల మెడలో లయగా ఊగే గంటల మోతలు
కిచ కిచ లాడే పిచ్చుక గూళ్లు
తొలకరి మొలకలు
రివ్వు రివ్వుమనే వడిశెల సవ్వడులు
కోతలు, నూర్పిళ్లు
ధాన్యంతో క్రిక్కిరిసిన గాదెలు
బారులు తీరిన రంగవల్లులు
డూడూ బసవన్నలు...
ఇవేమీ కనపడవేం?
ఏమైంది నా ఊరికి?
వీధులన్నీ ఖాళీగా ఉన్నాయేం?
ఊరి జనమంతా జీవం లేని మొహాలతో
దిగాలుగా కూర్చున్నారేం?
నా ఊరెందుకిలా ఎండి పోయింది?

నా ఊరెందుకిలా ఏడుస్తుంది??

2 comments:

  1. ౫౦ రూపాయలు ఇంట్లో కొబ్బరి దింపు దించడానికి
    ౧౦౦ రూపాయలు ఇల్లు కట్టడానికి
    ౩౫౦ రూపాయలు అల్లం ఆరబెట్టదానికి

    ఏడుస్తున్నది పల్లె కాదు ధనవంతులు.

    ReplyDelete
  2. prasad గారు..ధనవంతులు ఖర్చు చేసేది రైతులకు చేరితే బాగానే ఉండేది..కానీ అలా జరగట్లేదు కదా..అంతా దళారులే దోచేస్తున్నారు..పల్లె ఏడవక ఏంచేస్తుంది?

    ReplyDelete