30 September 2011

కంచెకు చేరిన కథ

అన్నదాత రైతన్నకు
ఎన్నడూ రాని దైన్య స్థితి
దిక్కుతోచని పరిస్థితి -
గతి తప్పిన గాలులు..
శృతి తప్పిన వానలు..
మొలకెత్తని విత్తనాలు..
తలనెక్కిన అప్పులు..
మింటినంటిన ఎరువుల ధరలు..
ఆగని రైతన్న కన్నీటి ధారలు..
కనిపించని మద్దతులు..
వయసుడిగిన సేద్య పద్ధతులు -
రోజూ కరెంటు కోతలే ఐతే
పంటకోతలు ఇంకెక్కడ?
కలో గంజో తాగుతూ
పంటను కంటికి రెప్పలా కాపాడుతూ
కాస్తో కూస్తో పండిస్తే
దాన్ని కాస్తా తన్నుకు పోయే రాబందు దళారులు -
పొలానికి వేశారు తాళాలు
ఇంటికి తాళం వేయాల్సిన అవసరం లేదు-
ఇలా రైతన్నలు నీరసిస్తే...
ఇక పండించలేమని నిరసిస్తే...
ఏమిటీ మన భవిష్యత్తు?
ఏమై పోతుందీ జగత్తు??

4 comments:

  1. చాల బాగా వ్యక్తపరిచారు రైతన్న కష్టాలన్నీ ...! ఇలానే సాగితే " అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ , అడుక్కుతినే ఆంధ్రప్రదేశ్ గా " త్వరలోనే మారుతుంది ...!

    ReplyDelete
  2. thank you for your response రాజేష్ మారం...

    ReplyDelete
  3. ధన్యవాదాలు...రాజేష్ దేవభక్తుని.

    ReplyDelete