అరే...!
పొద్దున్నే కలిశాడే -బాగోగులు మాట్లాడుకున్నామే...
అసలు ఊహించనే లేదు
అంతలోనే ఇంతటి హఠాత్పరిణామమా?
ఎంత ఘోరం జరిగింది..?
ఎప్పుడు కలిసినా
నవ్వుతూ ఆప్యాయంగా పలకరించేవాడు
ఇక కనుపించడు -
అవును...!
మరణం ఒక ఊహకందని చరణం
ఒక అదృశ్య చలనం
విశ్వ విన్యాసంలో
ఒక వినిపించని రాగం
ఒక అంతరించని గానం!
No comments:
Post a Comment