రాసే అక్షరాల్లో దోషముంటే
చెరిపేసి తిరిగి రాసుకుంటాం -
మాట్లాడే మాటల్లో తప్పు దొర్లితే
క్షమించమని అడుగుతాం -
పాడే పాటలో అపశృతి పలికితే
సరిచేసుకుంటాం -
జీవితంలో పొరపాట్లు జరగడం సహజమే..
వాటిని సరిదిద్దుకోవడం ప్రతిసారీ సాధ్యం కాదు
అలాంటి పొరపాట్లు
పునరావృతం కాకుండా చూసుకోవడమే
మనం చేయగలిగింది!
No comments:
Post a Comment