ఆలోచనలకు చెదలు పట్టి
మెదడు డొల్లబారింది
శ్వాస కల్మషమై
ఊపిరితిత్తులు కుళ్లిపోయాయి
నెత్తురు గడ్డకట్టి
ప్రవాహం ఆగిపోయింది
నడవడిక కుంటిదై
చతికిల పడింది
తనువంతా నీరసించి..
నరాలన్ని కృశించి..
కదిలే ఓపికలేక..
బ్రతికే దారేతెలియక..
ఉన్నచోటే కాళ్లు దిగేసుకొని
ఊబిలో కూరుకుపోతున్నాం -
కాలం కళ్లలోనే బందీ అయింది
తీరం సముద్రంలో కరిగిపోయింది
ఇక ముందుకు సాగలేం..
ఉన్నచోటే ఉండలేం..
ఇది మార్పుకు అదును -
ఇది ప్రక్షాళన సమయం -
ఇదే ఆఖరిపోరాటం కావాలి...
ఇదే గెలుపుకు సోపానంగా మారాలి!
ప్రక్షాళన సమయం లోనే మరో విప్లవం రావాలి ..యువ శకం వచ్చి రేపటి భవితకు పునాదులు వేయాలి ..
ReplyDeleteథాంక్యూ నవజీవన్...
ReplyDelete