మజిలీలెన్నైనా-
ఏ అనుభవమెదురైనా-
ఆగదీబాటసారి...
అలుపెరుగని ప్రయాణం!
అరచేతిని అడ్డుపెట్టి
సూర్యకాంతినాపలేరు-
తుపాకీ గురిపెట్టి
ప్రజాశక్తినణచలేరు-
నిన్నొక ఈజిప్ట్ నేడొక లిబియా-
రేపొక సౌదీఅరేబియా-
అంతం కాదిది ఆరంభం...
నియంతలకిక చెల్లింది కాలం!
సొంత గూట్లో...
పచ్చడి మెతుకులైనా
పంచామృతాలే!
ప్రేమ గాయం చేస్తుంది-
ప్రేమ నేరం చేయిస్తుంది-
ప్రేమ గుడ్డిది-
ప్రేమ పిచ్చిది-
ఇన్ని వంకర్లున్నా...
అదంటే ఎందుకో ..?
అందరికీ...
అంత పిచ్చి!!!
అడ్డుగోడలెన్ని కట్టినా,
విషజ్వాలలెన్నిరేపినా,
ప్రేమానురాగాల ముడులు...
విడదీయడం...
ఎవరి తరం!!!
ఇండస్ట్రీలో...
థర్టీ ఇయర్స్ -
ఫుల్ మీల్స్...?
ఓన్లీ త్రీ డేస్!!!
సర్వం...
త్యజించాలంటే -
ముందుగా...
అన్నీవెనకేసుకోవాలేమో??