28 February 2011

హేండ్‌ పంప్‌






ఎంత బాదినా...
ఏడవదేం???





                     

27 February 2011

అనుబంధం


వానకు మేమంటే
ఎంత ప్రేమో...
ఏకంగా ఇంట్లోకే దూరేస్తుంది!
మా అందర్నీ  క్షణంలో
ఒకే చోటుకు చేరుస్తుంది
ఎలాగంటే -
మా ఇంట్లో చినుకులు పడకుండా ఉండేది
ఆ ఒక్క చోటే కదా!!

జాగ్రత్త




లోకాన్ని జయించాలన్న
తొందరలో...
నిన్ను నువ్వు పోగొట్టుకోకు సుమా!

వైరాగ్యం


ఇంత పెద్ద ప్రపంచంలో
ఇంత మంది మనుషుల మధ్య
నేను ఒంటరినే...
ఎందుకంటే-
నేనెవరికీ ఏమీకానుగనుక!

20 February 2011

అద్వైతం




మంచితనం మానవత్వం
మంటగలిసిన ఈరోజుల్లో...
మనిషి మనిషిగా
మారగలిగితే చాలు-
దైవత్వం సాధించినట్టే!!!




13 February 2011

వైరుధ్యం

   

    ఎక్కడ చూసినా...
    క్రిక్కిరిసిన జనం!
    మనిషికీ మనిషికీ మధ్య
    గాలి కూడా దూరలేనంతగా!
    కానీ... ఎందుకో -
    మనసుకు మనసుకు మధ్యే...
    పూడ్చలేనంత అగాథం!!!

12 February 2011

నా కళ్లు

చెట్లు కూలుతున్న దృశ్యం...
పక్షులు నేలకొరుగుతున్న దృశ్యం...
పచ్చని చెట్లమధ్య ఆడుకున్న ఆటలు-
మెల్లగా కరుగుతున్న దృశ్యం...
నాగరికత నాగళ్ళు-
హరిత వనాల్ని బీళ్ళుగా మారుస్తున్న దృశ్యం...
స్వర్గాన్ని తలపించే మా ఊరు-
వల్లకాడులా మారుతున్న దృశ్యం....
నా కళ్లముందు ఎప్పుడూ కదలాడుతూ ఉంటే...
కునుకు పట్టని కళ్లు!
కన్నీటితో చెమర్చిన కళ్లు!!
కాంతి హీనమైన కళ్లు....నా కళ్లు!!!

10 February 2011

జ్ఞాపకాలు



చిన్ననాటి జ్ఞాపకాలు
తరుముకొస్తుంటే
వయసు ముదురుతున్నా
మనసు చిగురిస్తోంది

ఆనందపుఅలలలో
విహరిస్తోంది