03 April 2011

దేశమంటే మనుషులేనా?



దేశమంటే మట్టికాదోయ్‌
దేశమంటే మనుషులోయ్‌
అన్నారు గురజాడ ఆనాడు!
దేశమంతా మనుషులైతే
మానవత్వం జాడ ఏదోయ్‌?
మనుషులంతా ఒక్కటేనను
భావన ఎక్కడుందోయ్‌?
నువ్వు వేరని నేను వేరని
ఒకరినొకరు ఈసడించిన
దేశమేగతి బాగుపడునోయ్‌?
అని మళ్ళీ పాడుకోవాలేమో
మనందరం ఈనాడు!!

2 comments:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  2. సాధారణ పౌరుడు గారికి ధన్యవాదాలు. I have corrected the mistake.

    ReplyDelete