అక్షరరూపం దాల్చిన మనసులోని మాటలు, మెదడులోని ఆలోచనలు
22 April 2011
నువ్వు నేను
నువ్వా? నేనా? అంటే
అది కలహం..
నువ్వూ నేనూ అంటే
అది స్నేహం..
నువ్వే నేనంటే
అది ప్రేమ..
నీవెంటే నేనంటే
అది బంధం..
నువ్వక్కడా నేనిక్కడుంటే
అది నరకం..
నువ్వూ నేనూ కలిసుంటే
అది స్వర్గం!
నువ్వు నేను
ReplyDeleteబాగుందండీ..
బై ది బై...
నాపేరు గంగాధర్ వీర్ల.. ప్రస్తుతం హెఎంటీవీలో పనిచేస్తున్నాను
..
వీలైతే నా బ్లాగు: www.guppedumanasu.blogspot.com
గంగాధర్ గారు, మీ స్పందనకు చాలా కృతజ్ఞతలు. మీ బ్లాగు చూశాను. మీ కవితలు చాలా బాగున్నాయి.. థాంక్యూ..!
ReplyDeleteచాలా బావుందండీ!
ReplyDeleteచిన్ని ఆశ గారు, నా కవిత మీద మీ స్పందన తెలిపినందుకు చాలా ధన్యవాదాలు..!
ReplyDelete