నువ్వు బయటకెళ్తున్న ప్రతిసారీ
'జాగ్రత్త నాయనా' అంటూ
నీకోసం కంగారు పడుతూ చెప్పేది అమ్మ
నువ్వు తిరిగొచ్చేదాకా
మనసు మనసులో ఉండేది కాదు అమ్మకు
అమ్మెప్పుడూ అంతే
ఊరికే కలత చెందుతుంది -
అని కొట్టిపారేసేవాడివి నువ్వు
కానీ నీకు తెలియని విషయం ఒకటుంది
ఆ అమ్మ ఆశీస్సులతొనే
నువ్వు ఇంతవాడవయ్యావు!
ఈ రోజున నువ్వెక్కడున్నావో..?
ఎంత ఎత్తు ఎదిగావో..?
ఇప్పుడు అమ్మగురించి ఆలోచించడం నీ వంతు -
ఒక్కసారి అమ్మను తలచుకో!
అమ్మ జాగ్రత్తగా ఉందో లేదో తెలుసుకో!!
'జాగ్రత్త నాయనా' అంటూ
నీకోసం కంగారు పడుతూ చెప్పేది అమ్మ
నువ్వు తిరిగొచ్చేదాకా
మనసు మనసులో ఉండేది కాదు అమ్మకు
అమ్మెప్పుడూ అంతే
ఊరికే కలత చెందుతుంది -
అని కొట్టిపారేసేవాడివి నువ్వు
కానీ నీకు తెలియని విషయం ఒకటుంది
ఆ అమ్మ ఆశీస్సులతొనే
నువ్వు ఇంతవాడవయ్యావు!
ఈ రోజున నువ్వెక్కడున్నావో..?
ఎంత ఎత్తు ఎదిగావో..?
ఇప్పుడు అమ్మగురించి ఆలోచించడం నీ వంతు -
ఒక్కసారి అమ్మను తలచుకో!
అమ్మ జాగ్రత్తగా ఉందో లేదో తెలుసుకో!!
మీ ప్రతి కవితా నా గుండెల్ని తట్టి లేపుతోంది. ధన్యవాదాలు.
ReplyDeleteఅది నా అదృష్టంగా భావిస్తాను..థాంక్యూ వెరీ మచ్..!
ReplyDelete