నేను నిలుచున్న భూమి -
నాపైనున్న ఆకాశం -
మధ్యలొ ఉన్న నేను...
నాపరిమాణమెంత..?
నాకంటూ ఒక ఉనికి
ఈ బ్రహ్మాండంలో ఉందా?
నేనెందుకు ఇక్కడ ఉన్నాను?
నేనేం చెయ్యగలను..?
ఈ కొటానుకోట్ల
సూర్యమండలాలు
నిరంతరం ప్రజ్వలిస్తున్న
విశ్వాంతరాళంలో
కంటికి కనిపించనంతటి
ఒక చిన్న రేణువును...!
నాకున్న శక్తి ఎంత?
ఏమో...?
నాకనిపిస్తుందీ...
ఈ విశాల విశ్వాన్ని
ఒక్క గుటకలో మింగేయ గలనని..
ఈ నక్షత్ర మండలాలన్నింటినీ
ఒక్క చిటికెలో సమాయత్తం
చేయగలనని..
ఏమో..ఈవిశ్వాన్నంతా
కబళించగల శక్తి
నాలో ఉన్నదేమో అనిపిస్తుంది
నిద్రాణమైఉన్న నాశక్తిని
ఉసిగొలిపితే ఈ విశ్వాన్నే
హరించివేయ గలనేమో..?
అందుకే ఓ మానవుడా..!
నన్ను దీర్ఘనిద్రలో ఉండిపోనీ..
నా శక్తిని నాలోనే
నిక్షిప్తమైపోనీ..
ఈ మానవాళి మనుగడకు
ముప్పు వాటిల్లనీయకు!
Chaala chaalaa baagundandi... mee blog ki raavadam idhe modati saari.. meeru baaga raasthunnaru..
ReplyDeleteAll the Best!
శివ చెరువు gaaru, meeku chaala chaalaa dhanyavaadaalu..!
ReplyDelete