ఓ మంచి కవిత రాయాలని
కలం కాగితం ముందేసుక్కూర్చున్నా
ఏ కవిత రాయాలో అర్థం కాలేదు-
భావ కవిత రాద్దామంటే
అన్నీ భాషకందని భావాలే,
విప్లవ కవిత రాయాలనుకుంటే
అన్నీ తిరగబడుతున్న ఆలోచనలే,
అభ్యుదయ కవిత మొదలెడదామంటే
అన్నీ బద్దకపు ఛాయలే,
మానవతావాద కవిత సరే అనుకుంటే
అన్నీ వెక్కిరిస్తూ మీద పడుతున్న మానవ శకలాలే,
సంప్రదాయ కవితకు శ్రీకారం చుడదామంటే
అన్నీ 'సారీ' అంటూ జారుకుంటున్న పదాలే,
అనుభూతి కవితైనా పోనీలే అనుకుంటే
అన్నీ భూతాలై భయపెడుతున్న జ్ఞాపకాలే,
ఇక నా వల్ల కాదని లేచి వెళ్లబోతుంటే
మరి 'నన్నేం చేస్తావ్' అంటూ ఎదురుపడింది
అప్పటికే ముస్తాబైన నా కవిత!
కలం కాగితం ముందేసుక్కూర్చున్నా
ఏ కవిత రాయాలో అర్థం కాలేదు-
భావ కవిత రాద్దామంటే
అన్నీ భాషకందని భావాలే,
విప్లవ కవిత రాయాలనుకుంటే
అన్నీ తిరగబడుతున్న ఆలోచనలే,
అభ్యుదయ కవిత మొదలెడదామంటే
అన్నీ బద్దకపు ఛాయలే,
మానవతావాద కవిత సరే అనుకుంటే
అన్నీ వెక్కిరిస్తూ మీద పడుతున్న మానవ శకలాలే,
సంప్రదాయ కవితకు శ్రీకారం చుడదామంటే
అన్నీ 'సారీ' అంటూ జారుకుంటున్న పదాలే,
అనుభూతి కవితైనా పోనీలే అనుకుంటే
అన్నీ భూతాలై భయపెడుతున్న జ్ఞాపకాలే,
ఇక నా వల్ల కాదని లేచి వెళ్లబోతుంటే
మరి 'నన్నేం చేస్తావ్' అంటూ ఎదురుపడింది
అప్పటికే ముస్తాబైన నా కవిత!
ముస్తాబైన ఆ 'కవిత 'ని వర్ణించండి .
ReplyDeleteఅక్షర మోహనం గారు, పైన చెప్పిందే ఆ కవితండీ
ReplyDelete