ఓ ప్రభూ!
నేనొక గడ్డిపువ్వును...
నీ దర్శన భాగ్యం కోసం
ఎన్నాళ్ళుగానో వేచియున్న
ఒక అభాగ్య పువ్వును...
నిత్యం నిను చేరే పుష్పాలది
ఎంత అదృష్టమో కదా..!
అవి నీ మెడలో..నీ ఎదపై..నీ పాదాల చెంతా.. చేరి
నిన్ను స్పృశిస్తూ,
నీకెంత హాయిని కలిగిస్తాయో...
ఈ మనుషులకెందుకు నాపై ఇంత వివక్ష..?
నాలో రమ్యమైన వర్ణాలు లేవనా..?
నేను వేరే పుష్పాల్లా పరిమళాలు చింద లేననా..?
నేను వాటంత మృదువుగా లేననా..?
పొరపాటునైనా ఏదో రోజు నన్ను నీ చెంతకు
చేరుస్తారేమోనని ఎంత ఎదురు చూశాను..!
నాకు నిరాశే మిగిలింది -
హే ప్రభూ..!
నేను కురూపిని కావచ్చు
సువాసనలు వెదజల్లలేక పోవచ్చు
అనేక రంగులతో అలరించనూలేక పోవచ్చు
కానీ..నిన్ను ఒక్కసారి కనులారా వీక్షించాలని,
నీ పాదాలను ఒకపరి తనివారా స్పృశించాలని,
నీ ప్రాంగణంలోనే అలసి,సొలసి చివరకు సమసి పోవాలని
ఎంతగానో పరితపించే ఈ గడ్డిపువ్వును కనికరించలేవా ప్రభూ..!
వేయిమార్లు నన్ను మళ్లీ గడ్డిపువ్వుగా
పుట్టించినా స్వీకారమే గానీ,
ఈ దీనురాలి కోరికను ఒక్కసారి మన్నించవా ప్రభూ..!!
నేనొక గడ్డిపువ్వును...
నీ దర్శన భాగ్యం కోసం
ఎన్నాళ్ళుగానో వేచియున్న
ఒక అభాగ్య పువ్వును...
నిత్యం నిను చేరే పుష్పాలది
ఎంత అదృష్టమో కదా..!
అవి నీ మెడలో..నీ ఎదపై..నీ పాదాల చెంతా.. చేరి
నిన్ను స్పృశిస్తూ,
నీకెంత హాయిని కలిగిస్తాయో...
ఈ మనుషులకెందుకు నాపై ఇంత వివక్ష..?
నాలో రమ్యమైన వర్ణాలు లేవనా..?
నేను వేరే పుష్పాల్లా పరిమళాలు చింద లేననా..?
నేను వాటంత మృదువుగా లేననా..?
పొరపాటునైనా ఏదో రోజు నన్ను నీ చెంతకు
చేరుస్తారేమోనని ఎంత ఎదురు చూశాను..!
నాకు నిరాశే మిగిలింది -
హే ప్రభూ..!
నేను కురూపిని కావచ్చు
సువాసనలు వెదజల్లలేక పోవచ్చు
అనేక రంగులతో అలరించనూలేక పోవచ్చు
కానీ..నిన్ను ఒక్కసారి కనులారా వీక్షించాలని,
నీ పాదాలను ఒకపరి తనివారా స్పృశించాలని,
నీ ప్రాంగణంలోనే అలసి,సొలసి చివరకు సమసి పోవాలని
ఎంతగానో పరితపించే ఈ గడ్డిపువ్వును కనికరించలేవా ప్రభూ..!
వేయిమార్లు నన్ను మళ్లీ గడ్డిపువ్వుగా
పుట్టించినా స్వీకారమే గానీ,
ఈ దీనురాలి కోరికను ఒక్కసారి మన్నించవా ప్రభూ..!!
గడ్డి పువ్వు ఆవేదన ....అద్భుతం. భావం భవ్యం. "తనివారా" కు బదులు "తనివి తీర" అని వుంటే .....? అభినందనలు శ్రీనివాస రెడ్డి గారు...శ్రేయోభిలాషి ..నూతక్కి.
ReplyDeleteనూతక్కి గారు మీ అమూల్యమైన వ్యాఖ్యలకు నా ధన్యవాదాలు..!
ReplyDelete