28 January 2013

అవశేషం!

ముసురు పట్టి చాన్నాళ్ళైంది-
ఫెళ్ళున తగిలే ఈదురు గాలులు..
నరాలు తెగ్గోసే చలి...
ఎప్పుడు ప్రళయం ముంచుకొస్తుందో..?
అప్పుడప్పుడూ తళుక్కుమనే
మెరుపుల వెలుగుల్లో
కనిపించీ కనిపించని దారులు..
ముసురు ఉసురు తగిలి
అసువులు బాసిన అభాగ్యులెందరో...
ఈ సశేషాల అవశేషాలు
అంతమయ్యేదెప్పుడో?

2 comments:

  1. చాలాబాగారాసారు.

    ReplyDelete
  2. పద్మార్పిత గారికి ధన్యవాదాలు..!

    ReplyDelete