03 March 2013

ఒక ఆలోచన


గీసే ప్రతిదీ బొమ్మ కాదు - 
రాసే ప్రతిదీ కవిత కాదు -
చెప్పే ప్రతిదీ కథ కాదు -
పాడే ప్రతిదీ పాట కాదు - 

అప్పుడప్పుడూ...ఒక నిగూఢమైన ఆలోచన...

గుండె అట్టడుగుపొరలను చీల్చుకొని
మనసు ఇనుప తెరలను ఛేదించుకొని
హృదయ కుహరంలోంచి వెలికి చొచ్చుకొని
ప్రసవించీ, ప్రభవించీ, ప్రసరించీ..
ఓ కాన్వాసుమీద ప్రతిఫలిస్తుంది..
ఓ కాగితమ్మీద అక్షర రూపం దాలుస్తుంది..
ఓ పలుకులో పులకరిస్తుంది..
ఓ గొంతులో తాండవిస్తుంది..
లలితమై, రజితమై, జ్వలితమై 
పంచభూతాల్లో మిళితమై
తాథాత్మ్యం చెందుతుంది!

2 comments:

  1. నిగూఢమైన ఆలోచనలను హృదయపు కాన్వాసు పై గజిబిజి గా చి్త్రించితే ,,అవి అక్షరరూపం లో జనించి అందరిని అలరించే కవితగా రూపు దిద్ధుకొంది ..
    ఆలోచనే చాలా బాగుందండి ....

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు paddu గారు...

      Delete