21 August 2011

ఓ నాన్న ఆవేదన

నాది చాదస్తమే -
నీకు చెప్పిందే చెప్పి
పదే పదే చెప్పి
విసిగిస్తున్నాను కదూ..
కానీ నేనెందుకలా చెబుతున్నానో
ఒక్కసారి ఆలోచించు..
నేను పడ్డ బాధలు
నువ్వు పడకూడదని,
నేను తిన్న ఎదురు దెబ్బలు
నువ్వు తినకూడదని,
నాకంటే గొప్పగా
నువ్వు బ్రతకాలని
జీవితంలో ఏదైనా
గొప్ప విషయాన్ని సాధించాలని
నేను ఆశపడ్డం తప్పా -
నాకంతా తెలుసు..
నాకేమీ చెప్పక్కర్లేదూ అంటావు..
కాదనను....
కానీ నా ఆత్రుత నాది
నాకు తెలిసిన విషయాలన్నీ
నీకు చెప్పెయ్యాలనే తొందర
అంతే..
నువ్వు మంచేదో చెడేదో తెలుసుకుని
సరైన మార్గంలో నడుస్తుంటే
నాకంటే ఆనందించేదెవరు!
నువ్వు సంతోషంగా జీవిస్తుంటే
నాకంటే గర్వించేదెవరు!!

4 comments:

  1. బాగుందండీ మీ బ్లాగు. మీ రచనలు ఇప్పుడే చదువుతున్నాను. బాగున్నాయి. చిన్న చిన్న పదాలతో అన్ని రకాల భావాలనూ బాగా వ్యక్తీకరిస్తున్నారు.

    ReplyDelete
  2. baagundi.tanDri manasu chakkagaa cheppaaru. comment section lo word verification teesEstE baagunTundi..

    ReplyDelete
  3. ధన్యవాదాలు శిశిర గారు.

    ReplyDelete
  4. Ennela గారికి ధన్యవాదాలు..

    ReplyDelete