17 May 2011

తొలకరి చినుకు


ఎర్రని ఎండ
కొలిమిలా మండుతుంది
చుర చుర లాడే వేడి,
భగ్గుమనే సెగ,
తనువంతా ఎండిపోతూ..
నాలుక ఆరిపోతూ..
వంట్లోని శక్తంతా
హరించుకు పోతూ..
కళ్లు బైర్లు కమ్ముతూ..
అడుగుతీసి అడుగు
వేయలేకపోతూ..
నేలకు ఒరిగిపోతున్న
సమయంలో -
టప్పున మీద పడిందొక
నీటి బొట్టు ఆకాశంలోంచి -
హిమనీ నదాల చల్లదనం
నరనరాల్లో ప్రాకుతూ..
అణువణువూ ప్రవహిస్తూ..
హాయిని కురిపిస్తూ..
వెళ్లిపోతున్న శక్తిని
వెనక్కు మళ్లిస్తూ..
పెదవులపై చిరునవ్వును వెలిగిస్తూ..
మదిలో ఆనందం చిందిస్తూ..!

No comments:

Post a Comment