11 February 2013

ప్రేమించు


మనిషన్నవాడికి మనసుండాలి
మనసుంటే ప్రేమించాలి
ఆ ప్రేమ పవిత్రంగా ఉండాలి
ఆ ప్రేమను ప్రత్యక్షంగా చూపించాలి.. 
రహస్యంగా ఉంచేది ప్రేమ కాదు
రక్తాన్ని కోరేది ప్రేమ అనిపించుకోదు..
ప్రేమను పంచు..ప్రేమను పెంచు
ప్రేమతో జీవించు..ప్రేమను బ్రతికించు 
ప్రేమించినవారి హృదయంలో 
ప్రేమజ్యోతిని వెలిగించు..
ప్రేమను ప్రేమించు ప్రేమకై - 
ప్రేమను రక్షించు మనిషి మనుగడకై!

2 comments: