19 February 2013

ఆసుపత్రికి జబ్బు చేసింది







ఆసుపత్రికి జబ్బు చేసింది
వెంటనే ఓ మంచి డాక్టర్ని పిలవండి - 
బయట పరిసరాలకు గేంగ్రీన్..
లోపల పరికరాలకు కేన్సర్..
మింగడానికి మందులెటూ లేవ్
తాగడానికి నీళ్లు కూడా కరువే -
నీది పెద్ద జబ్బు..వెంటనే పెద్దాసుపత్రికి పో అంటారు
లెన్స్ బెట్టి వెతికినా అంబులెన్స్ కనబడదు
ఇక పెద్దాసుపత్రికి పోయేది పోస్ట్ మార్టానికే..
గుళ్ళో దేవుడు నయం రోజూ దర్శనమిస్తాడు  
డాక్టర్ బాబును చూడాలంటే మాత్రం 
ఎన్ని నరకాలు దాటాలో...
నీ అదృష్టం బాగుండి
డాక్టర్  సాబ్ కనిపించి
జబ్బు ముదిరిందని
ఆపరేషన్ టేబులెక్కించినా  
దానిమీద పడుకుంటే
ముందుగా పోయేది కరెంటో...నీ ప్రాణమో..
చెప్పడం చాలా కష్టం -
వేల కోట్ల బడ్జెట్టున్నా ఆసుపత్రికి నయంకాదు..
వందలకొద్దీ డాక్టర్లున్నా దవాఖానాకు దారి తెలీదు..
మనకు రోగమొస్తే ఆసుపత్రికి పోతాం
ఆసుపత్రికే జబ్బు చేస్తే ఇంకెక్కడికెళ్తాం?
వల్లకాటికి తప్ప...!!!    

4 comments:

  1. అక్షరాలా ఇదే జరుగుతున్నది. మనం అంతర్జాలం లో ఎంత రాసుకున్న పోయేది పోస్ట్ మార్టం కే. నిజాలు ఇంతే మరి

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పింది నిజమే...ఏదో నా ఆలోచనలను మీ ముందుంచడానికి ప్రయత్నించానంతే...మీ స్పందనకు ధన్యవాదాలు...

      Delete