06 February 2013

ఇది ప్రక్షాళణ సమయం


ఆలోచనలకు చెదలు పట్టి
మెదడు డొల్లబారింది
శ్వాస కల్మషమై
ఊపిరితిత్తులు కుళ్లిపోయాయి
నెత్తురు గడ్డకట్టి
ప్రవాహం ఆగిపోయింది
నడవడిక కుంటిదై
చతికిల పడింది
తనువంతా నీరసించి..
నరాలన్ని కృశించి..
కదిలే ఓపికలేక..
బ్రతికే దారేతెలియక..
ఉన్నచోటే కాళ్లు దిగేసుకొని
ఊబిలో కూరుకుపోతున్నాం -
కాలం కళ్లలోనే బందీ అయింది
తీరం సముద్రంలో కరిగిపోయింది
ఇక ముందుకు సాగలేం..
ఉన్నచోటే ఉండలేం..
ఇది మార్పుకు అదును -
ఇది ప్రక్షాళన సమయం -
ఇదే ఆఖరిపోరాటం కావాలి...
ఇదే గెలుపుకు సోపానంగా మారాలి!

2 comments:

  1. ప్రక్షాళన సమయం లోనే మరో విప్లవం రావాలి ..యువ శకం వచ్చి రేపటి భవితకు పునాదులు వేయాలి ..

    ReplyDelete
  2. థాంక్యూ నవజీవన్...

    ReplyDelete