13 April 2011

ఆ పక్షుల రవళినై...

అడవంటే నాకు ప్రాణం
అడవిని తలచుకోగానే
నాకు ఎక్కడలేని ఆనందం కలుగుతుంది
అడవికి వెళ్తున్నామనుకోగానే
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తాను
అడవిలోని ప్రశాంతత, పచ్చదనం అంటే
నాకెంతో ఇష్టం
అడవిలోని పెద్ద పెద్ద చెట్లు
ఎప్పటినుంచో తపస్సు చేసుకుంటున్న
ఋషుల్లా కనిపిస్తాయి
వాటిని స్పృశించాలని
వాటి నీడలో నిదురించాలని
ఎంతో ఆశగా ఉంటుంది
చిరుగాలికి ఆ చెట్లు చేస్తున్న సవ్వడి
నాకు ప్రకృతి పాడుతున్న
మధుర గానంలా వినిపిస్తుంది
ఆ పక్షుల కిలకిలా రవాలు
ఆ సెలయేటి గలగలలు
ఆ అడవిపూల పరిమళాలు
నన్ను ఏదో లోకం లోకి
తీసికొని వెళతాయి
నేను -
ఆ పక్షుల రవళినై
ఆ సెలయేటి నురగనై
ఆ పూవుల పుప్పొడినై
ఆ అడవిలో అదృశ్యమై పోవాలనిపిస్తుంది -
అడవంటే నాకు అంత ప్రాణం!!

4 comments:

  1. సత్య gaaru, mee abhinandanalaku chaalaa dhanyavaadaalandi..!

    ReplyDelete
  2. చాలా బాగుంది మీ వనవిహారం సార్...

    ReplyDelete
  3. కెక్యూబ్ గారు, మీ స్పందనకు చాలా కృతజ్ఞతలండీ..!

    ReplyDelete