15 April 2011

నేను ప్రేమించాను!

నేను ప్రేమించాను -
ఉదయించే సూర్యుని కిరణాల్లోని
వెచ్చదనాన్ని ప్రేమించాను
వెన్నెల రాత్రి చందమామ కురిపించే
చల్లదనాన్ని ప్రేమించాను
గుబురుగాపెరిగిన వృక్షజాలం కనబరచే
పచ్చదనాన్ని ప్రేమించాను
కల్లా కపటం తెలియని పసివాడు చిందించే
బోసినవ్వును ప్రేమించాను
చీకటిని తరిమేస్తూ వెలుగును వెదజల్లే
చిరుదివ్వెను ప్రేమించాను
కల్మషంలేని హృదయంతో పలకరించే
స్నేహితుడి పిలుపును ప్రేమించాను
ప్రేమతో తలనిమిరే
తల్లి ఆప్యాయతను ప్రేమించాను
నేనున్నానంటూ వెన్నుతట్టే
తండ్రి ఆలంబనను ప్రేమించాను
భోజనానికి టైమైంది లేవండంటూ రాగంతీసే
అర్థాంగి అనురాగాన్ని ప్రేమించాను -
ఇంత ప్రేమను పదిలంగా దాచుకున్న నాకు
ఈ ప్రపంచంలో ఇక లేనిదంటూ ఏముంది..?

6 comments:

  1. andarikee annee dorakaalani naa korika.. mee spandanaku chaalaa dhanyavaadaalu..

    ReplyDelete
  2. సరళమైన పదాలతో చక్కగా రాసారు, బావుంది!

    ReplyDelete
  3. sharma గారు, మీ ప్రోత్సాహకరమైన స్పందనకు చాలా ధన్యవాదాలండి..!

    ReplyDelete
  4. manasunu suthimetthaga thakinattunai mee kavithalu ... i appriciate your efforts and all the best ..

    ReplyDelete
  5. manasu palike...gaariki naa dhanyavaadaalu.

    ReplyDelete